|
|
by Suryaa Desk | Sat, Sep 16, 2023, 10:56 AM
ముగ్గురి పై యువకుడు దాడి చేసిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. గుంటూరు పట్టణం అరండల్ పేట 6వ లైనులో నివసించే సుభాని మటన్ షాపులో షప్రూద్దీన్ పని చేసేవాడు. అతడి వద్ద పనిమానేసి షఫ్రూద్దీన్ వేరే చోట చేరాడు. దీనిపై అతడ్ని సుభాని కొట్టి గాయపరిచాడు. దీంతో షఫ్రూద్దీన్ శుక్రవారం సుభాని ఇంటికి వెళ్లి అతడితో పాటు తండ్రి జిలాని, తల్లి హలీమాలను తీవ్రంగా కొట్టి గాయపరిచాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Latest News