పెద్దమ్మతల్లికి ఘనంగా పంచమృతాభిషేకం
by Suryaa Desk |
Sat, Sep 16, 2023, 10:36 AM
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధిలోని కేశవాపురం జగన్నాధపురం గ్రామాల మధ్య కొలువైన శ్రీపెద్దమ్మతల్లి ఆలయంలో శుక్రవారం అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. పూజలో భాగంగా ముందుగా అమ్మవారికి హారతి, మంత్రపుష్పం, నివేదన, నీరాజనం సమర్పించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి రజనీకుమారి తెలిపారు.
Latest News