|
|
by Suryaa Desk | Fri, Sep 15, 2023, 01:51 PM
సీపీఐ ఆధ్వర్యంలో గురువారం ప్రొద్దుటూరు స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు బి. రామయ్య, పట్టణ కార్యదర్శి పి. సుబ్బరాయుడు మాట్లాడుతూ కొత్తపల్లె గ్రామ పంచాయతీ సుందరయ్య కాలనీ పరిధిలో పేదల భూములు అన్యాక్రాంతమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. ధర్నాలో సీపీఐ నాయకులు షరీఫ్, హరి, శివారెడ్డి, మద్దిలేటి, తదితరులు పాల్గొన్నారు.
Latest News