|
|
by Suryaa Desk | Fri, Sep 15, 2023, 01:11 PM
రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తూ విడపనకల్ మండలం మాళాపురం గ్రామస్తులు ఎస్. ఐ తిప్పాయ నాయక్ ను కోరగా ఆయన స్పందించారు. శుక్రవారం ఉదయం ప్రమాదకరమైన మలుపుల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. 42వ జాతీయ రహదారి కావడంతో పాటు గ్రామానికి అనుకోని ఉండడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని అందుకోసమే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినట్లు ఎస్. ఐ తెలిపారు.
Latest News