|
|
by Suryaa Desk | Fri, Sep 15, 2023, 12:38 PM
సామాజిక మాధ్యమాలలో సీఎం జగన్ పై తెదేపా రాప్తాడు మండల అధ్యక్షురాలు రామాంజనమ్మ అలియాస్ స్వర్ణక్కను పోలీసులు అరెస్టు చేశారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ సోషల్ మీడియాలో సీఎం జగన్ పై వ్యక్తిగత దూషణలు చేశారని స్వర్ణక్కపై వైసీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెను గురువారం అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. కేసు నమోదు చేసి సాయంత్రం 41 ఎ నోటీసు అందజేసి పంపించేశారు.
Latest News