|
|
by Suryaa Desk | Fri, Sep 15, 2023, 11:58 AM
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. చివరి శ్రావణ శుక్రవారం కావడంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రీవారి దర్శనానికి 18 కంపార్ట్ మెంట్ లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 12 గంటలు పడుతోంది. నిన్న స్వామివారిని 61,926 మంది భక్తులు దర్శించుకున్నారు. కాగా, శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.32 కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.
Latest News