|
|
by Suryaa Desk | Thu, Sep 14, 2023, 03:59 PM
ఏపీ సీఎం జగన్ చేసిన తప్పులను ప్రజాక్షేత్రంలో ఎండగడతామని టీడీపీ నేత నారా లోకేశ్ స్పష్టంచేశారు. రాజమండ్రిలో లోకేశ్ మాట్లాడుతూ.. తమ అధినేత చంద్రబాబు దేనికీ భయపడరని, ఆయన జైల్లో ఉన్నా జగన్‌కు చెమటలు పట్టిస్తున్నారన్నారు. ‘‘రాష్ట్ర సరిహద్దుల్లో యుద్ధవాతావరణం సృష్టిస్తున్నారు. ప్రభుత్వ అరాచకాలపై పోరాడితే హత్యాయత్నం కేసులు పెడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేనతో కలిసి పోరాటం చేయాలని నిర్ణయించాం’’ అని వెల్లడించారు.
Latest News