|
|
by Suryaa Desk | Thu, Sep 14, 2023, 03:07 PM
కేరళ రాష్ట్రంలో నిఫా వైరస్ కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే వైరస్ కేసుల సంఖ్య ఐదుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో కోజికోడ్ జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు రేపు కూడా ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. అయితే యూనివర్సిటీ పరీక్షలు యథావిధిగా జరుగుతాయని వెల్లడించింది. విద్యార్థులకు ఆన్‌లైన్ ద్వారా పాఠాలు చెప్పవచ్చని పేర్కొంది. నిఫా వైరస్ కలకలంతో గురువారం సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే.
Latest News