ఐటీఐల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం
 

by Suryaa Desk | Thu, Sep 14, 2023, 01:02 PM

శ్రీకాకుళం జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఐటీఐల్లోని వివిధ ట్రేడుల్లో మిగిలిన సీట్లను నాలుగో విడతలో భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా కన్వీనర్‌, ఎచ్చెర్ల ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్‌ ఎం.సుధాకరరావు బుధవారం ఒక్క ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి గల వారు ఈ నెల 19వ తేదీలోగా ఐటీఐడాట్‌ఏపీడాట్‌జీవోవీడాట్‌ఇన్‌ వెబ్‌సైట్‌లో తమ వివరాలను రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలన్నారు. రిజిస్ట్రేషన్‌ పత్రాన్ని డౌన్‌లోడ్‌ చేసుకుని, ఒరిజనల్‌ సర్టిఫికేట్లతో సమీపంలోని ప్రభుత్వ ఐటీఐలో ఈ నెల 20వ తేదీలోగా పరిశీలన జరుపుకోవాలన్నారు. ప్రభుత్వ ఐటీఐల్లో సీట్లకు కౌన్సెలింగ్‌ ఈ నెల 22న, ప్రైవేట్‌ ఐటీఐల్లో కౌన్సెలింగ్‌ ఈ నెల 23వ తేదీన జరుగుతుందని పేర్కొన్నారు.

Latest News
Gunfire reported near White House; no injuries Sun, Apr 05, 2026, 06:22 PM
Passport row: Assam CM's wife to take legal action against Pawan Khera Sun, Apr 05, 2026, 06:20 PM
IPL 2026: Klaasen, Reddy lift SRH to 156/9 after early collapse against LSG Sun, Apr 05, 2026, 06:10 PM
BJP captures power in Khanapur municipality of Telangana with BRS support Sun, Apr 05, 2026, 06:07 PM
Chinese tourist's experience in Beijing reveals rapidly expanding system of identity control Sun, Apr 05, 2026, 05:38 PM