ఆర్టీసీ డ్రైవర్ పై గొడవకి దిగిన ప్రయాణికులు
 

by Suryaa Desk | Thu, Sep 14, 2023, 12:47 PM

పుంగనూరు సమీపంలోని బోడినాయనిపల్లె వద్ద ఆర్టీసీ బస్సు నిలపలేదని కొందరు వ్యక్తులు కుప్పం డిపోకు చెందిన డ్రైవర్‌ త్యాగరాజుపై బుధవారం రాత్రి దాడి చేశారు. కుప్పం- మదనపల్లె మార్గంలో నడుస్తున్న ఆర్టీసీ బస్సులో కొందరు మదనపల్లెనుంచి పుంగనూరు వస్తుండగా బోడినాయునిపల్లె బస్టాప్‌ వద్ద బస్సు నిలపాలని కోరారు. డ్రైవర్‌ త్యాగరాజు ఎక్సప్రెస్స్ బస్సు ఎక్కడపడితే అక్కడ నిలవదని సమాధానం చెప్పడంతో ప్రయాణికులు డ్రైవర్‌పై దాడి చేసి గాయపరిచారు. దీంతో డ్రైవర్‌ బస్సును పోలీ్‌సస్టేషన్‌ వద్ద నిలిపి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పట్టణంలోని కొంతమంది అక్కడకు చేరుకుని ఇరువర్గాలకు నచ్చచెప్పి పంపివేయడంతో పోలీసులు కేసు నమోదు చేయలేదని తెలిసింది.

Latest News
IPL 2026: Patidar's knock was the turning point, he accelerated beautifully, says Pietersen Mon, Apr 06, 2026, 04:21 PM
Study finds rising cancer rates especially after breast cancer treatment Mon, Apr 06, 2026, 04:19 PM
Critical illness protection gap widens in India despite rising employer health coverage: Report Mon, Apr 06, 2026, 04:15 PM
Rahul Gandhi, MK Stalin campaign separately in Puducherry; trigger buzz over INDIA Bloc coordination Mon, Apr 06, 2026, 04:12 PM
Achieving milestones is a result of what you do over the years: Bhuvneshwar 200 IPL wickets feat Mon, Apr 06, 2026, 04:06 PM