|
|
by Suryaa Desk | Thu, Sep 14, 2023, 12:45 PM
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు అరెస్టుకి నిరసనగా గురువారం ఉదయం 9 గంటలకు ఆత్మకూరు పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నట్లు టీడీపీ నేతలు తెలిపారు. వారు మాట్లాడుతూ.... చంద్రబాబు అరెస్టు వెనుక రాజకీయ కుట్ర ఉందని, ప్రతిఘటించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొని దీక్షలను విజయవంతం చేయాని కోరారు.
Latest News