|
|
by Suryaa Desk | Thu, Sep 14, 2023, 12:32 PM
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, కైకలూరు మండలం కొల్లేటికోట జగనన్న కాలనీలో ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్ళితే.... ఇంటి నిర్మాణానికి బోరు వేసేందుకు కలిదిండి మండలం ఎస్సార్పీ అగ్రహారం గ్రామానికి చెందిన పరసా నాగమల్లేశ్వరరావు (29) వెళ్లాడు. బోరు వేస్తుండుగా ప్రమాదవశాత్తు బోరు వేసే రాడ్లు పైన ఉన్న విద్యుత్‌వైర్లకు తగిలి విద్యుదాఘాతానికి గురయ్యాడు. దీంతో స్ధానికులు 108 ద్వారా కైకలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
Latest News