|
|
by Suryaa Desk | Thu, Sep 14, 2023, 12:30 PM
ఏపీలో ప్రజాస్వామ్యం అదుపు తప్పిందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కరువైనదని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తపరిచారు. చంద్రబాబు అరెస్టుతో ప్రజాస్వామ్యాన్ని అదుపుచేసే నాథుడు కరవయ్యాడు అని ఆవేదన వ్యక్తపరిచారు. ఈ కేసులో అత్యుత్సాహం చూపిస్తున్న అధికారుల చిట్టా తయారు చేస్తున్నాం, సరైన సమయంలో గుణపాఠం చెబుతాం అని హెచ్చరించారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా సత్తెనపల్లిలో ఆందోళనకు దిగిన కార్యకర్తలపై డీఎస్పీ, పోలీసు అధికారులు వ్యవహరించిన తీరు అత్యంత బాధాకరం. డీజీపీ వెంటనే అతనిని సస్పెండ్ చేసి క్రిమినల్ చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేసారు.
Latest News