|
|
by Suryaa Desk | Thu, Sep 14, 2023, 12:26 PM
టీడీపీ అధినేత చంద్రబాబు ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని స్కిల్ డెవలప్‌మెంట్ కంపెనీ వారు నేరుగా తెలుపుతున్నా కక్షపూరితంగా ప్రభుత్వం పెద్దలు వ్యవహరిస్తున్నారని టీడీపీ మంత్రాలయం నియోజకవర్గ ఇన్‌చార్జి తిక్కారెడ్డి అన్నారు. రాష్ట్రం బాగుపడాలంటే బాబు నాయకత్వం అవసరమని ప్రజలు కూడా ఎదురుచూస్తున్నారని అన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ చేపట్టిన బంద్‌కు స్వచ్ఛందంగా మద్దతు తెలిపారన్నారు. అనంతరం మత సామరస్యానికి ప్రతీకగా ఉన్న శ్రీజగద్గురు ఖాదర్ లింగ స్వామి దర్గాలో చంద్రబాబు త్వరగా జైలు నుంచి విడుదల కావాలని ప్రత్యేక ఫాతేహాలు నిర్వహించారు.
Latest News