|
|
by Suryaa Desk | Thu, Sep 14, 2023, 11:44 AM
మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గతేడాది మే 9న సీఐడీ అధికారులు నమోదు చేసిన అమరావతి మాస్టర్ ప్లాన్ డిజైనింగ్‌తో పాటు ఇన్నర్ రింగ్ రోడ్(ఐఆర్‌ఆర్) ఎలైన్‌మెంట్ రూపకల్పనలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలకేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు. ఆయన తరఫున సీనియర్ న్యాయవాదులు దమ్మాలపాటి శ్రీనివాస్, పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. ఈ వ్యవహారంపై వివరాలు సమర్పించాలని సీఐడీ తరఫు న్యాయవాదిని ఆదేశించింది. విచారణను 19వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కె.సురేశ్‌రెడ్డి బుధవారం ఆదేశాలిచ్చారు.
Latest News