|
|
by Suryaa Desk | Thu, Sep 14, 2023, 11:29 AM
ఇటీవల భారీ వరదలతో అతలాకుతలమైన హిమాచల్ ప్రదేశ్‌కు బీహార్ సీఎం నితీష్ కుమార్ రూ.5 కోట్ల సాయం ప్రకటించారు. ఈ మేరకు నితీష్‌కుమార్ హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖుకి బుధవారం లేఖ రాశారు. కాగా ఇటీవల కుంభవృష్టి, భారీ వరదలు, కొండచరియలు విరిగిపడటంతో సుమారు 400 మంది ప్రజలు మరణించారు. సుమారు 13,000కు పైగా నివాసాలు ధ్వంసమవగా, రూ.12,000 కోట్లకు పైగా నష్టం ఏర్పడినట్లు ప్రభుత్వం అంచనా వేసింది.
Latest News