|
|
by Suryaa Desk | Thu, Sep 14, 2023, 10:52 AM
మధ్యప్రదేశ్‌లో దతియా జిల్లాలోని రెండా గ్రామంలో దారుణం జరిగింది. ప్రకాశ్ దంగి, ప్రీతం పాల్ అనే వ్యక్తుల మధ్య పశువుల గడ్డి విషయంలో జరిగిన గొడవ చిలికి చిలికి గాలివానలా మారింది. ఇరువురి మధ్య తలెత్తిన గొడవ రెండు వర్గాల మధ్య కాల్పులకు దారితీసింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడినవారిని పోలీసులు సమీప ఆసుపత్రికి తరలించారు.
Latest News