|
|
by Suryaa Desk | Thu, Sep 14, 2023, 10:47 AM
టీడీపీ అధినేత చంద్రబాబును కలిసేందుకు ఈరోజు పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, లోకేశ్ రాజమండ్రి జైలుకి వెళ్లనున్నారు. ఇవాళ మ. 12 గంటలకు వారు జైలుకు చేరుకుని చంద్రబాబును పరామర్శించి, భద్రత గురించి తెలుసుకుంటారని టీడీపీ వర్గాలు పేర్కొన్నాయి. వీరి ములాఖత్ నేపథ్యంలో జైలు అధికారులు భద్రతను పటిష్టం చేశారు. ములాఖత్ తర్వాత ముగ్గురు మరోసారి సమావేశమై పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.
Latest News