|
|
by Suryaa Desk | Wed, Sep 13, 2023, 04:11 PM
విజయవాడలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, పార్టీ నేతలతో సమావేశమయ్యారు. అధికారంలోకి వస్తామనే భావనతో పనిచేయాలని, పోలింగ్ బూత్ వరకూ పార్టీ కమిటీలు ఏర్పాటుచేయాల్సిందే అన్నారు. మండల స్థాయిలో కూడా కమిటీలు వేసుకోకపోతే పార్టీ కార్యక్రమాలు ఎలా చేస్తామన్నారు. సర్పంచ్ సమస్యలపై క్షేత్ర స్థాయిలో చేపట్టిన ఉద్యమం ద్వారా పార్టీ గొంతుక బలంగా వినిపించగలిగామని సంతృప్తి వ్యక్తంచేశారు. జిల్లా కమిటీలు స్థానిక సమస్యలపై ప్రజల తరఫున పోరాడాలని, సోషల్ మీడియా ద్వారా మోదీ ప్రభుత్వ విజయాలు, సంక్షేమ పథకాలపై ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పురందేశ్వరి పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు.
Latest News