|
|
by Suryaa Desk | Wed, Sep 13, 2023, 04:11 PM
టీడీపీ అధినేత చంద్రబాబుకు మద్దతుగా మాట్లాడిన జాతీయ నేతలకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబుపై పెట్టిన కేసు ముమ్మాటికీ అక్రమమేనని.. ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తామని అన్నారు. తమకు న్యాయం దక్కే వరకు పోరాటం కొనసాగుతుందన్నారు. ప్రజల కోసం పోరాటం కొనసాగించామని చంద్రబాబు దిశానిర్దేశం చేశారని లోకేష్ గుర్తుచేశారు.
Latest News