|
|
by Suryaa Desk | Wed, Sep 13, 2023, 04:07 PM
చంద్రబాబుకు బెయిల్ ఇవ్వాలా?, వద్దా? అనేది ప్రధాని మోదీ నిర్ణయిస్తారని, దీనిపై కేంద్రం నిర్ణయం తెలుసుకోవడానికి సీఎం జగన్ ఢిల్లీ వెళతారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ అన్నారు. జీ-20 సదస్సు జరుగుతున్న సమయంలో చంద్రబాబును అరెస్టుచేసి అందరి దృష్టినీ అటు మళ్లించినందుకు జగన్‌కు మోదీ నుంచి అక్షింతలు పడే అవకాశం ఉందన్నారు. మోదీ, అమిత్‌షాతో చర్చించాకే చంద్రబాబు బెయిల్‌పై నిర్ణయం జరుగుతుందన్నారు. ఎక్కువ సీట్లు ఉన్నాయని జగన్ విర్రవీగుతున్నారని, అది అన్నివేళలా మంచిది కాదని అన్నారు.
Latest News