|
|
by Suryaa Desk | Wed, Sep 13, 2023, 01:32 PM
సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన సెప్టెంబర్ 20న ఏపీ కేబినేట్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చించడంతో పాటు పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకోనున్నారు. కాగా వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు కొన్ని ఆర్డినెన్సులకు సంబంధించిన బిల్లులు, మరికొన్ని కొత్త బిల్లులను సభలో ప్రవేశపెట్టనున్నారు.
Latest News