|
|
by Suryaa Desk | Wed, Sep 13, 2023, 01:23 PM
చంద్రబాబు విజనరీ కాదని, ఆయన ఆర్గనైజ్డ్ క్రిమినల్ అని వైయస్ఆర్‌సీ పార్లమెంటరీ పార్టీ నేత, పార్టీ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి అభివర్ణించారు. చంద్రబాబు ఓ స్కిల్డ్ నేరస్థుడు. ఆయన చేయని అరాచకాలు లేవని విమర్శించారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో షెల్ కంపెనీల ద్వారా బినామీ అకౌంట్లలోకి నిధులు మళ్లించారు. రూ. 3000 కోట్లలో.. రూ. 2700 కోట్లు ఇస్తామని సీమెన్స్ ఎప్పుడూ చెప్పలేదు. ఈస్కాంలో సుమారు రూ. 470 కోట్లు కొట్టేశారు. ఒక్క రుపాయి కూడా ముట్టలేదని సీమెన్స్ చెబుతోంది. ఈ కుంభకోణం చేసింది బాబే. దర్యాప్తు సంస్థల విచారణలో ఈ విషయం బయటపడిందన్నారు. టీడీపీ మాటలను ఎవరూ విశ్వసించే పరిస్థితి లేదని అన్నారు. టీడీపీ బంద్‌కు అసలు స్పందనే లేదన్న ఎంపీ.. బంద్ రోజు హెరిటేజ్ షాప్‌లు కూడా మూయలేదని చెప్పారు. బాబు నీతిమంతుడని ఎవరూ అనుకోవడం లేదని, అన్ని కేసుల్లో ఆయన స్టేలు తెచ్చుకున్నారని దుయ్యబట్టారు.
Latest News