రాశి ఫలాలు 13-09-2023: బుధవారం
 

by Suryaa Desk | Wed, Sep 13, 2023, 12:26 PM

మేషం: బంధువులు ఒక ముఖ్యమైన వ్యవహారంలో మీ మాటతో విబేదిస్తారు. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. రాబడికి మించిన ఖర్చులు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఉద్యోగం అదనపు బాధ్యతలు వస్తాయి. 
వృషభం: ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. బంధు మిత్రులతో ఆలయాలు సందర్శిస్తారు. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. నూతన రుణయత్నాలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలు మండకోడిగా సాగుతాయి. బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి. 
మిధునం: ప్రముఖుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఇంటా బయట ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. ఆర్థికంగా ఇబ్బంది ఉన్న అవసరానికి ధన సహాయం లభిస్తుంది. 
కర్కాటకం: ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు ఉంటాయి. ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి. దైవ చింతన పెరుగుతుంది. దాయదులతో భూ వివాదాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగమున సహోద్యోగులతో మాట పట్టింపులు ఉంటాయి.
 సింహం: ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులు విజయవంతంగా సాగుతాయి. స్థిరస్తి కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది. నిరుద్యోగుల కలలు నిజమవుతాయి. 
కన్య: వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన కార్యక్రమాలలో ఆటంకాలు ఉంటాయి. చిన్నపాటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి . కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు కలుగుతాయి. చిన్ననాటి మిత్రులతో విభేదిస్తారు. వృత్తి, వ్యాపారాలలో సమస్యలు తప్పవు. 
తుల: సంతానానికి నూతన విద్యావకాశాలు లభిస్తాయి. పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. చేపట్టి పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు మరింత ఉత్సాహాన్నిస్తాయి. నూతన వస్తు లాభాలు పొందుతారు. 
వృశ్చికం: నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. దీర్ఘకాలిక వివాదాలకు సంబంధించి ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో దీర్ఘకాలిక సమస్యల నుంచి గట్టెక్కుతారు. వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. 
ధనస్సు: దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. బంధువులతో ఒక విషయంలో మాటపట్టింపులు కలుగుతాయి. చేపట్టిన పనుల్లో కొంత జాప్యం తప్పదు ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. 
మకరం: ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. అవసరం లేని వస్తువుల పై ధన వ్యయం చేస్తారు. బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు. ఉద్యోగమున శ్రమాధిక్యత పెరుగుతుంది. రుణదాతల నుండి ఒత్తిడి అధికమవుతుంది. 
కుంభం: ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. చిన్ననాటి మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు ఆశించిన స్థాన చలానాలు కలుగుతాయి. 
మీనం: చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. స్థిరస్తి వివాదాల పరిష్కారమవుతాయి. ప్రముఖుల సహాయంతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు అధిగమిస్తారు. కీలక వ్యవహారంలో సన్నిహితుల నుండి విలువైన సమాచారం సేకరిస్తారు.

Latest News
EAM Jaishankar and UNGA President discuss reformed multilateralism, SDGs and West Asia conflict Tue, Apr 28, 2026, 05:01 PM
FIFA World Cup 2026: 'Modric will do everything to recover in time,' says Croatia coach Dalic Tue, Apr 28, 2026, 04:47 PM
PM Modi gets grand welcome in Varanasi, women power in spotlight Tue, Apr 28, 2026, 04:46 PM
Markets end lower as crude oil surge weighs; mid, small caps outperform Tue, Apr 28, 2026, 04:43 PM
Maruti Suzuki India's Q4 net profit dips 6.4 pc to Rs 3,659 crore, announces Rs 140 dividend Tue, Apr 28, 2026, 04:26 PM