|
|
by Suryaa Desk | Tue, Sep 12, 2023, 11:25 PM
మంగళవారం కొలంబో వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 49.1 ఓవర్లలో 213 పరుగులు చేసింది. లక్ష్యాన్ని ఛేదించిన శ్రీలంక 41.3 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌటైంది. శ్రీలంక బ్యాట్స్‌మెన్‌లో దునిత్ 42 పరుగులు, ధనుంజయ డిసిల్వా 41 పరుగులు చేసారు. టీమిండియా బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 4 వికెట్లతో తన సత్తా చాటాడు. ఈ విజయంతో టీమిండియా ఆసియాకప్ ఫైనల్ బెర్త్ దాదాపు ఖాయం.
Latest News