|
|
by Suryaa Desk | Tue, Sep 12, 2023, 02:47 PM
పల్నాడు జిల్లా, చిలకలూరిపేట, టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు తో సహా 89 మంది టీడీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. చంద్రబాబును తరలిస్తుండగా సంఘీభావంగా చిలకలూరిపేటలో టీడీపీ శ్రేణులు నిరసనకు దిగాయి. కాన్వాయ్‌ను అడ్డుకుని పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని కేసులు నమోదు అయ్యాయి. రోడ్డుపై గుమ్మిగూడి రాకపోకలకు అంతరాయం కలిగించారని.. దారిన వెళ్లే వాహనదారుడిపై దాడి చేశారని కూడా టీడీపీ శ్రేణులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Latest News