నేనున్నా, అధైర్యపడకండి
 

by Suryaa Desk | Tue, Sep 12, 2023, 02:41 PM

చంద్రబాబు అరెస్టుతో కొందరు ప్రాణాలు కొల్పోయారని... ఆ కుటుంబాలను పరామర్శిస్తానని హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. నేడు మీడియాతో బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘‘నేను వస్తున్నా.. నేనే ముందుంటా. స్వాతంత్ర్య సమరం మనం చూడలేదు. కానీ ఇప్పుడు ఆ స్ఫూర్తితో పోరాడాల్సి ఉంటుంది. జనం ఆలోచించాలి. ఇలాగే భయపడుతూ కూర్చొంటే ఏపీ సర్వ నాశనం అవుతుంది. సైనికుల్లా ప్రతి ఒక్కరూ తిరగబడాల్సిన సమయం ఆసన్నమైంది. ఆలోచించడం కాదు.. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది. టీడీపీ ఎన్నో సంక్షోభాలు చూసింది.. ఇప్పుడూ అధిగమిస్తాం. ఇప్పుడే కాదు.. ఇంకా కేసులు పెడతారు. జగన్ లండన్ ఎందుకెళ్లారు? ఇవాళే జగన్ ఏపీకి వచ్చాడంట.. ఈ హ్యాంగోవర్ దిగడానికి మరో పది రోజులు పడుతుందేమో..? ప్రజాపక్షాన పోరాడతాం. మన శక్తి యువత.. వారిని స్ట్రీమ్ లైన్ చేయాలి.స్కిల్ డెవలప్మెంట్ శిక్షణకు సంబంధించి సీమెన్స్ సంస్థతో తొలి ఒప్పందం 2013లో ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే ట్రైనింగ్ నిమిత్తం డిజైన్ టెక్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. సీమెన్స్ సాఫ్ట్ వేర్ సరఫరా చేస్తే.. డిజైన్ టెక్ శిక్షణ ఇచ్చింది. ప్రభుత్వ వాటా 10 శాతం. హిందూపురంలో మేమూ స్కిల్ డెవలప్మెంట్ శిక్షణలో మేళా నిర్వహించాం అని అన్నారు.

Latest News
Iran warns US army against entering Strait of Hormuz Mon, May 04, 2026, 03:14 PM
Left staring at loss of last state, to be out of power after 50 years Mon, May 04, 2026, 03:12 PM
Pakistani forces accused of extrajudicially killing three civilians in Balochistan: Rights Body Mon, May 04, 2026, 02:11 PM
Kerala Polls: Chandy Oommen's bicycle campaign rides into history Mon, May 04, 2026, 02:09 PM
'Trinamool will have the last laugh': Mamata Banerjee's new message to her party workers Mon, May 04, 2026, 01:45 PM