|
|
by Suryaa Desk | Tue, Sep 12, 2023, 01:44 PM
కుందుర్పి మండల కేంద్రంలో వెలసిన అపార ఘన చరిత్ర కలిగిన వీరభద్ర స్వామి దేవాలయంలో మంగళవారం శ్రావణమాసం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరభద్రస్వామి జీర్ణోద్ధరణ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అర్చకుడు మంజునాథ, వేద పండితుడు మంత్రోచ్ఛారణ నడుమ గణ, రుద్రహోమం, నవగ్రహాల పూజ, రుద్రాభిషేకం, ఆకు పూజ , పుష్పాలంకరణ, చౌడేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పుష్పాలంకరణ, మహా మంగళహారతి అత్యంత ఘనంగా నిర్వహించారు.
Latest News