|
|
by Suryaa Desk | Tue, Sep 12, 2023, 12:50 PM
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నా శవం కూడా బీజేపీ వైపు వెళ్లదు’ అంటూ వ్యాఖ్యానించారు. తన రాజకీయ జీవనమే సెక్యులరిజం భావాలు కలిగినదని పేర్కొన్నారు. సిద్దరామయ్య గతంలో బీజేపీలో చేరేందుకు ప్రయత్నించారని జేడీఎస్ నేత కుమారస్వామి చేసిన వ్యాఖ్యలపై ఈ మేరకు సీఎం తీవ్రంగా స్పందించారు. ఇటీవల ఢిల్లీలో అమిత్‌షాను కలిశానని, అంతమాత్రాన బీజేపీలో చేరేందుకు ప్రయత్నించినట్లేనా అన్నారు.
Latest News