|
|
by Suryaa Desk | Tue, Sep 12, 2023, 12:42 PM
నంద్యాల పట్టణంలోని నూనెపల్లి పోలీస్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన పోలీస్ స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి 40 ఫిర్యాదులు స్వీకరించినట్లు ఎస్పీ రఘువీర్‌రెడ్డి తెలిపారు. ఫిర్యాదుదారుల నుంచి వినతులు స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో స్వయంగా ఫోన్‌లో మాట్లాడి చట్టపరిధిలో ఫిర్యాదుదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. సమస్యల పట్ల నిర్లక్ష్యం వహించకుండా ఫిర్యాదులు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు. ఎస్పీతో పాటు అడిషనల్ ఎస్పీ వెంకటరాముడు, ఎస్‌బీ డీఎస్పీ సంతోష్, సీఐ సూర్యమౌలి పాల్గొన్నారు.
Latest News