ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'కూలీ' OST రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Wed, Sep 10, 2025, 07:35 PM

లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన సూపర్ స్టార్ రజనీకాంత్ యొక్క తాజా యాక్షన్ డ్రామా కూలీ బాక్స్ఆఫీస్ వద్ద భారీ సెన్సేషన్ ని సృష్టిస్తుంది. కూలీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తమిళ చిత్రానికి ఆల్-టైమ్ అతిపెద్ద ఓపెనర్ అయ్యిన లియోను అధిగమించింది. తాజాగా ఇప్పుడు చిత్ర బృందం ఈ సినిమా యొక్క ఒరిజినల్ సౌండ్‌ట్రాక్ (OST) యూట్యూబ్ మరియు మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులోకి వచ్చినట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రంలో నాగార్జున, సౌబిన్ షాహిర్, శ్రుతి హాసన్, అమీర్ ఖాన్, మరియు రచితా రామ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుద్ సంగీతాన్ని కంపోస్ చేసిన ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ పై నిర్మించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa