ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అతుల్ కులకర్ణి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'డకాయిట్' టీమ్

cinema |  Suryaa Desk  | Published : Wed, Sep 10, 2025, 07:30 PM

టాలీవుడ్ యువ నటుడు అడివి శేష్ రాబోయే పాన్-ఇండియా చిత్రం 'డకాయిట్' అనే యాక్షన్ డ్రామాతో ప్రేక్షకులని అలరించటానికి సిద్ధం అవుతున్నాడు. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, సునీల్, అతుల్ కులకర్ణి, జైన్ మేరీ ఖాన్, అనురాగ్ కశ్యప్, కామక్షి భాస్కర్లా కూడా నటించారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న అతుల్ కులకర్ణి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసారు. హిందీ, తెలుగు భాషల్లో ఏకకాలంలో ఈ సినిమాని చిత్రీకరిస్తున్నారు. అడివి శేష్ మరియు షానీల్ డియో ఈ చిత్రానికి కథ మరియు స్క్రీన్ ప్లే కూడా అందించారు. ఈ చిత్రం డిసెంబర్ 25న విడుదల కానుంది. ఈ సినిమాకి భీమ్స్ సెసిరోలియో ట్యూన్లను కంపోజ్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను సుప్రియ యార్లగడ్డ నిర్మించారు. సునీల్ నారంగ్ సహ నిర్మాతగా, అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించారు. 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa