ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఇడ్లీ కడై' ఫస్ట్ సింగల్ వివరాలు

cinema |  Suryaa Desk  | Published : Wed, Jul 23, 2025, 07:40 PM

బహుముఖ నటుడు ధనుష్ దర్శకత్వం వహించిన తమిళ డ్రామా చిత్రం 'ఇడ్లి కడై' తో ప్రేక్షకులని అలరించటానికి సిద్ధంగా ఉన్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా, ధనుష్ కథానాయకుడిగా నటించాడు. షూటింగ్ పూర్తి అయ్యిన తర్వాత ఈ సినిమా ప్రమోషన్స్ ప్రారంభం కానున్నాయి. ఈ చిత్రం అక్టోబర్ 1, 2025న ఈ సినిమా విడుదల కానుంది. మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ఫస్ట్ సింగల్ ని జులై 27న విడుదల కానున్నట్లు ప్రకటించారు. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, జివి ప్రకాష్ కుమార్ కంపోస్ చేసిన ఈ సాంగ్ కి ధనుష్ లిరిక్స్ అందించగా, శ్వేతా మోహన్ మరియు ధనుష్ ఈ సాంగ్ కి తమ గాత్రాలని అందించారు. నిత్య మీనన్ మహిళా ప్రధాన పాత్ర పోషిస్తుండగా, అరుణ్ విజయ్ విరోధిగా నటించాడు. అరుణ్ విజయ్, పార్థిబాన్ మరియు సత్యరాజ్ ఈ సినిమాలో సహాయక పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాకి జివి ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇడ్లీ కడై తెలుగులో "ఇడ్లీ కోటు" అనే టైటిల్ తో విడుదల కానుంది. వండర్‌బార్ ఫిల్మ్స్ మరియు డాన్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ ప్రాజెక్టును బ్యాంక్రోలింగ్ చేస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa