మోహన్‌లాల్ నటించిన మలయాళ చిత్రం 'ఇట్టిమాని: మేడ్ ఇన్ చైనా' ఎట్టకేలకు ఓటీటీలోకి వస్తోంది. 2019లో విడుదలై ₹35 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ సినిమా, ఆరేళ్ల తర్వాత ఈటీవీ విన్ వేదికగా జూలై 24 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో మోహన్ లాల్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేశారు. మలయాళంలో అప్పట్లో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa