2025 లో అత్యంత ఉహించిన బాలీవుడ్ చలన చిత్రాలలో 'వార్ 2' ఒకటి. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ హై-ఆక్టేన్ స్పై యాక్షన్ థ్రిల్లర్ లో హ్రితిక్ రోషన్, జూనియర్ ఎన్టిఆర్ , కియారా అడ్వానీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా పై భారీ హైప్ ఉంది. ఇప్పుడు అన్ని కళ్ళు ఈ సినిమా యొక్క థియేట్రికల్ ట్రైలర్ పై ఉన్నాయి. ఇది చాలా త్వరగా విడుదల అవుతుందని భావిస్తున్నారు. తాజాగా ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ ని జులై 23న విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఆగష్టు 14, 2025న విడుదల కానున్న ఈ చిత్రం వైఆర్‌ఎఫ్ స్పై యూనివర్స్‌లో ప్రధాన భాగం. యశ్ రాజ్ ఫిలింస్ ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు భాషల్లో భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ప్రీతమ్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. ఆదిత్య చోప్రా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa