Mega157 అనే భారీ బడ్జెట్ చిత్రానికి సంబంధించిన తాజా షెడ్యూల్ షూటింగ్ ప్రస్తుతం కేరళలో జరుగుతోంది. అలప్పుజా వద్ద జరుగుతోంది.ఈ పాటలో మెగాస్టార్ చిరంజీవి, నయనతారలు జంటగా కనిపించనున్నారు. పెళ్లి సందడి నేపథ్యంలో రూపొందుతున్న ఈ గీతం పూర్తిగా జాయ్‌ఫుల్, సెలబ్రేటరీ మూడ్‌లో సాగుతుంది.. ఇందులో ఒక రొమాంటిక్ పాటను చిత్రీకరిస్తుండగా, అందుకు సంబంధించిన కొన్ని వీడియోలు, ఫోటోలు లీక్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ట్రెడిషనల్ డ్రెస్సుల్లో బోటుపై షూటింగ్ చేస్తున్న ఈ జంటను చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు.ప్రముఖ సంగీత దర్శకుడు భీమ్స్ సెసిరోలియో ఈ పాటను అద్భుతంగా కంపోజ్ చేశారు, ఇది ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండనుంది. ఈ షెడ్యూల్‌లో సాంగ్‌తో పాటు కొన్ని కీలక సన్నివేశాలను కూడా చిత్రీకరిస్తున్నారు. ఈ షూటింగ్ షెడ్యూల్ జులై 23, 2025 నాటికి పూర్తవుతుందని సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa