2024 సంక్రాంతి సీజన్‌లో థియేటర్లలోకి వచ్చిన పాన్-ఇండియన్ సూపర్ హీరో చిత్రం హనుమాన్ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టిస్తోంది. తేజ సజ్జ నటించిన ఈ చిత్రం ఇప్పటికే 350 కోట్ల గ్రాస్ మార్క్ ని చేరుకుంది. హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ సినిమా సీక్వెల్ 'జై హనుమాన్' ని ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇప్పటికే ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులను ప్రారంభించారని మూవీ మేకర్స్ ప్రకటించారు. 'జై హనుమాన్'లో ఒక పెద్ద స్టార్ ప్రధాన పాత్ర పోషిస్తారని కూడా అతను సూచించాడు. లేటెస్ట్ బజ్ ప్రకారం, ఈ సినిమాలో హనుమంతుని పాత్రలో నటించడానికి కన్నడ స్టార్ హీరో యష్ ని మూవీ మేకర్స్ సెలెక్ట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa