విజయ్ బిన్ని దర్శకత్వంలో అక్కినేని నాగార్జున ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'నా సామి రంగ' అనే టైటిల్ ని లాక్ చేసారు. నా సామి రంగా చిత్రం ప్రముఖ మలయాళ చిత్రం 'పొరింజు మరియం జోస్' కి అధికారిక రీమేక్. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో 15.30 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం.
ఈ గ్రామీణ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమా జనవరి 14, 2024న విడుదల కానుంది. నా సామి రంగ చిత్రంలో ఆశికా రంగనాథ్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రంలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్, మిర్నా మీనన్, రుక్సార్ ధిల్లాన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రూరల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. అకాడమీ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
'నా సామి రంగ' ప్రీ రిలీజ్ బిజినెస్ :::::
నైజాం : 5 కోట్లు
సీడెడ్ : 2.2 కోట్లు
ఆంధ్రప్రదేశ్ : 8 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 15.30 కోట్లు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa