ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారీ మొత్తానికి అమ్ముడయిన 'ఊరి పేరు భైరవకోన' థియేట్రిక‌ల్ రైట్స్

cinema |  Suryaa Desk  | Published : Fri, Jan 12, 2024, 06:34 PM

వీఐ ఆనంద్ దర్శకత్వంలో యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో సందీప్ కిషన్ ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ మిస్టరీ థ్రిల్లర్ కి 'ఊరి పేరు భైరవకోన' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమా ఫిబ్రవరి 9, 2024న థియేటర్లలోకి రానుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా యొక్క థియేట్రిక‌ల్ రైట్స్ ని 14 కోట్ల‌కు వీ3 ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సొంతం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ కథానాయికగా నటిస్తుంది. కావ్య థాపర్, హర్ష చెముడు, రాజశేఖర్ అనింగి, వెన్నెల కిషోర్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రతిష్టాత్మకంగా సమర్పణలో హాస్య మూవీస్‌ బ్యానర్‌పై రాజేష్‌ దండా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa