ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'సైంధవ్' వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ రిపోర్ట్

cinema |  Suryaa Desk  | Published : Fri, Jan 12, 2024, 05:48 PM

శైలేష్ కొలను దర్శకత్వంలో టాలీవుడ్ హీరో వెంకటేష్ తన 75వ సినిమాని అధికారికంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'సైంధవ్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమా జనవరి 13, 2024న థియేటర్‌లలో విడుదల కానుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 25 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం.

యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా నటిస్తుంది. ఈ పాన్-ఇండియన్ ప్రాజెక్ట్ లో బేబీ సారా, బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిక్, రుహాని శర్మ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ఈ హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఈ పాన్ ఇండియన్ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.


'సైంధవ్' ప్రీ రిలీజ్ బిజినెస్ :::::
తెలుగురాష్ట్రాలు : 19 కోట్లు
KA + ROI : 2 కోట్లు
OS : 4 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ : 25 కోట్లు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa