ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తాండల్ : పెద్ద స్క్రీన్‌లపై 'ఎసెన్స్ అఫ్ తాండల్'

cinema |  Suryaa Desk  | Published : Fri, Jan 12, 2024, 04:25 PM

కార్తికేయ 2 దర్శకుడు చందూ మొండేటితో నాగ చైతన్య తన తదుపరి సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి "తాండల్" అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ లవ్-యాక్షన్ డ్రామా చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ జరుగుతుంది. ఇటీవలే తాండల్ నిర్మాతలు ఈ సినిమా ఫస్ట్ గ్లింప్సె ని విడుదల చేసారు. తాజాగా ఇప్పుడు ఎసెన్స్ అఫ్ తాండల్ ని అన్ని సంక్రాంతి విడుదలలకు యాడ్ చేసినట్లు చిత్ర బృందం ప్రకటించింది.

ఈ చిత్రంలో సాయి పల్లవి కథానాయికగా నటించింది. ఈ చిత్రం 2018లో ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళంలో జరిగిన వాస్తవ సంఘటనల నుండి స్ఫూర్తిని పొందింది. GA2 పిక్చర్స్‌ పతాకంపై బన్నీ వాస్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa