టాలీవుడు స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న తాజా చిత్రం 'పుష్ప-2'. ఇది 2021లో వచ్చిన పుష్ప సినిమాకు సీక్వేల్‌గా రాబోతుంది..ఈ సినిమాను ఈ ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తుంది.. దీనిని స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. పుష్ప-2 షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ క్రమంలో ఇటీవల అల్లు అర్జున్ స్నేహితుడిగా కేశవ పాత్రలో నటిస్తున్న జగదీష్ హత్య కేసులో అరెస్ట్ అయ్యాడు.. దాంతో సినిమా విడుదల వాయిదా పడుతుందనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి..
తాజాగా, నేడు డైరెక్టర్ సుకుమార్ పుట్టిన రోజు కావడంతో మైత్రీ మూవీ మేకర్స్ ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ఆయనకు బర్త్ డే విషెస్ తెలుపుతూ 'పుష్ప-2' 2024 ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా సుకుమార్ ఫొటోను స్పెషల్‌గా క్రియేట్ చేసి మరీ షేర్ చేశారు.. ఆ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. ఈ న్యూస్ విన్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి..ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, టీజర్స్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేస్తున్నాయి.. మొదటి పార్ట్ కంటే సీక్వెల్ గా వస్తున్న సినిమా ఊరమాస్ గా ఉండబోతుందని టీజర్ ను చూస్తే అర్థమవుతుంది.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. ఇక ఈ సినిమాలో అనసూయ, సునీల్, రావు రమేష్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు..ఒక్క పోస్టుతో క్లారిటీ ఇచ్చిన మేకర్స్
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa