ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వినూత్నంగా ప్రమోషన్ చేస్తున్న నాని

cinema |  Suryaa Desk  | Published : Fri, Nov 24, 2023, 07:06 PM

నేచురల్ స్టార్ నాని హీరోగా నూతన దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా చిత్రం ‘హాయ్ నాన్న’. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి (సివిఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ‘సీతారామం’ బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో నాని కూతురుగా బేబీ కియారా ఖన్నా కనిపించనుంది. ఇప్పటికే విడుదల చేసిన సినిమా పాటలు, టీజర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. డిసెంబర్ 7న సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండ‌గా ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని నాని వినూత్నంగా ప్రమోషన్స్‌ని స్టార్ట్ చేశారు. తెలంగాణ‌లో ఎన్నిక‌ల సీజన్ కావడంతో.. రాజకీయ నాయకుడి గెటప్‌లో రెడీ అయ్యి..‘హాయ్ నాన్న’ పేరుతో ఓ పార్టీ  పెట్టినట్లుగా చెప్పుకొచ్చి ఓ మేనిఫెస్టో రెడీ చేసి  విడుదల చేశారు. పార్టీ మేనిఫెస్టో అంటూ తాజాగా నాని తన ఎక్స్ ఖాతాలో ఓ వీడియోని షేర్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa