మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ ఇంటెన్స్ అండ్ యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఈగల్’. ఈ సినిమా థియేట్రికల్ రాకకు కౌంట్‌డౌన్ మొదలైంది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టాలీవుడ్ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై తెరకెక్కుతోన్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా మేకర్స్ ఈగల్ నుంచి రవితేజ సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ 50 డేస్ కౌంట్‌డౌన్ పోస్టర్‌లో రవితేజ డెస్క్‌పై చాలా ఆయుధాలతో కనిపించారు. స్టైలిష్ డ్రెస్సింగ్‌లో ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఇటీవల విడుదలైన టీజర్ మంచి స్పందనను రాబట్టుకోవడమే కాకుండా.. సినిమాపై క్యూరియాసిటీ పెంచింది. కౌంట్‌డౌన్ ప్రారంభం కావడంతో మేకర్స్ మరింత దూకుడు పెంచారు. ఈ సినిమాలో రవితేజ మల్టీ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నారు. కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమాలో నవదీప్, మధుబాల ఇతర ముఖ్య తారాగణం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa