యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన లవ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'బుజ్జిగాడు' చిత్రం 'మేడ్ ఇన్ చెన్నై' ప్రభాస్ కెరీర్‌లో మోస్ట్ ఎనర్జిటిక్ అండ్ లవ్లీ పెర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. 2008లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. అయితే ఈ సినిమాలో ప్రభాస్ పెర్ఫార్మెన్స్, లుక్స్ కు మాత్రం భారీ ప్రశంసలు అందుకున్నాయి. ప్రభాస్ యాటిట్యూడ్, డైలాగ్స్, ఎనర్జీతో చాలా మంది అభిమానులకు 'బుజ్జిగాడు' సినిమా చాలా ఇష్టమైన సినిమా.
సందీప్ చౌతా ఈ సినిమాకి సంగీతం అందించారు. ఈ సినిమాలో త్రిష కథానాయికగా నటించింది. ప్రముఖ నటుడు మోహన్ బాబు ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించగా, కెఎస్ రామారావు తన క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై నిర్మించారు. తాజాగా ఇప్పుడు, ఈ యాక్షన్ ప్యాక్డ్ మాస్ చిత్రం 'బుజ్జిగాడు' 30 నవంబర్ 2023 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. పూరీ జగన్నాధ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం చేయడానికి ఇప్పటికే అందుబాటులో ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa