వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలక పాత్రలో నటిస్తున్న ‘కోట బొమ్మాళి పీఎస్’ మూవీ ఈ నెల 24న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా వరలక్ష్మీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. 'ఈ సినిమాలో నేను పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తాను. ఇందులో నాకు స్మోకింగ్ చేయడం ఇబ్బందిగా అనిపించింది. ఇప్పటివరకు ఏ సినిమాలో ఇలాంటి సీన్ చేయలేదు. క్యారెక్టర్‌కి ఆ సీన్ కంపల్సరీ కాబట్టి చేయాల్సి వచ్చింది' అని తెలిపింది.
ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా వరలక్ష్మి శరత్‌కుమార్ మాట్లాడుతూ.. 'ఈ సినిమాలో నేను, శ్రీకాంత్ పోలీస్ ఆఫీసర్స్ పాత్రలో కనిపిస్తాం. ఇద్దరిలో ఒకరు నేరస్తులైతే? రాజకీయ ఒత్తిళ్లు ఏమిటి? అనే అంశాలు ఆసక్తికరంగా ఉన్నాయి. మలయాళం 'నాయట్టు'కి రీమేక్ అయినప్పటికీ తెలుగులో చాలా మార్పులు చేశారు. ఈ సినిమాలో స్మోకింగ్ కాస్త ఇబ్బందిగా అనిపించింది. ఇప్పటి వరకు ఏ సినిమాలోనూ ఇలాంటి సీన్ చేయలేదు. క్యారెక్టర్ పరంగా కంపల్సరీ కావడంతో అలా చేయాల్సి వచ్చింది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలే కాకుండా క్యారెక్టర్ నచ్చితే ఎలాంటి జానర్‌లోనైనా నటించేందుకు సిద్ధమే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa