పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ 'సలార్'. ఈ మూవీకి రన్ టైమ్ పై ఓ వార్త వైరల్ అవుతోంది. సలార్ పార్ట్-1ను 2.55 గంటల నిడివి ఉండేలా మేకర్స్ కట్ చేసినట్లు తెలుస్తోంది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కెరీర్లోనే అత్యధిక రన్ టైంగా చెబుతున్నారు. ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్ కాగా, జగపతిబాబు, పృథ్వీరాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఈ మూవీ డిసెంబర్ 22న రిలీజ్ కానుంది.
ఈ మూవీ వచ్చే నెల 28వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అవుతుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. దీనికి తోడు టీజర్ కూడా సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ ఏకంగా ఆకాశాన్ని తాకుతోంది. ఎక్కడికక్కడ రేట్లు చుక్కలను అంటుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా రన్ టైంపై ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. సలార్ కు ఇప్పటికే సీక్వెల్ ను కూడా ప్రకటించారు ప్రశాంత్ నీల్. అయితే పార్ట్ 1 లెంత్ ఎక్కువ అయినా కట్ చేసి పార్ట్ 2లో వేసే అవకాశాలు ఉన్నాయి. పార్ట్ 1లో పది నిమిషాలు తొలగించినట్లు టాక్ వినిపిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa