అక్షయ్ కుమార్ నటించిన 'మిషన్ రాణిగంజ్' సినిమాను ఆ మూవీ టీం ఆస్కార్ కోసం జనరల్ కేటగిరీలో ఇండిపెండెంట్ నామినేషన్ వేసింది. 65 మంది మైనర్లను రక్షించిన జస్వంత్ సింగ్ గిల్ నిజజీవిత ఘటనల ఆధారంగా టిను సురేశ్ దేశాయ్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ నెల 6న రిలీజై ఓ మోస్తరుగా ఆడిన సినిమా, ఆస్కార్ బరిలో ఏ మేరకు మెప్పు పొందుతుందో చూడాల్సి ఉంది. కాగా.. భారత తరఫున అధికారికంగా మలయాళ సినిమా '2018' ఎంపికైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa