దర్శకుడు లోకేశ్ కనగరాజ్ ప్రస్తుతం ‘లియో’ చిత్రం తెరకెక్కిస్తున్నాడు. దీని తర్వాత రజనీకాంత్‌తో ఓ మూవీ చేయనున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న లోకేశ్ ‘ఖైదీ’ సీక్వెల్‌పై అదిరే అప్డేట్ అందించాడు. రజనీకాంత్‌తో చేయనున్న సినిమా తరువాత ‘ఖైదీ’ సీక్వెల్ ఉంటుందని చెప్పాడు. తాను కూడా ఆ రోజుకోసం ఆసక్తితో ఎదురుచూస్తున్నానని అన్నాడు. ఆ సినిమా సీక్వెల్ తనకి చాలా ప్రత్యేకమైనదని చెప్పుకొచ్చాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa