‘అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆప్యాయంగా, గౌరవపూర్వకంగా ఆ మహానటుడికి నివాళులర్పిస్తున్నట్లు మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు. ట్విట్టర్ లో చిరు స్పందిస్తూ.. 'ఆయన తెలుగు సినిమాకే కాదు.. భారతీయ సినీ చరిత్రలోనే ఓ దిగ్గజ నటుడు. ఆయన వందలాది చిత్రాల్లో నటించి.. తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు. తెలుగు సినిమా బతికినంత వరకు ప్రేక్షకుల మనుసుల్లో నిలిచి ఉంటారు.' అని ట్వీట్‌లో పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa